: చిత్తుగా తాగితే.. అంతా సర్దుకుంటుంది: వార్న్


సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఓ ఉచిత సలహా పారేశాడు. భారత్ చేతిలో వరుస ఓటములు, నలుగురు ఆటగాళ్లపై వేటు పరిణామాలతో కుంగిపోయిన కంగారూ ఆటగాళ్లను చిత్తుగా తాగమంటున్నాడు.  

ప్రస్తుత పరిస్థితుల్లో తానుంటే అదే చేసేవాడట.  రూమ్ లో కెళ్లి తలుపులు బిడాయించుకుని మాంచి సంగీతం నేపథ్యంలో వినవస్తుండగా, పూటుగా మందు కొట్టండని సూచించాడు. కఠిన నిబంధనలు విధించడం కంటే ఇదే బెటర్ అంటున్నాడు. అప్పుడు ఎవరి అభిప్రాయం వారు తప్పక చెబుతారని ఈ స్పిన్ దిగ్గజం సెలవిస్తున్నాడు. 

గెలుపు ప్రణాళికపై అభిప్రాయాలు చెప్పలేదని కోచ్ మికీ ఆర్థర్..  వైస్ కెప్టెన్ వాట్సన్, పేసర్లు జాన్సన్, ప్యాటిన్సన్, బ్యాట్స్ మన్ ఖవాజాలపై వేటు వేసిన సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్న్ తన వినూత్నమైన ఐడియాను ఆసీస్ శిబిరం ముందుంచాడు. 

  • Loading...

More Telugu News