: రాజీవ్ హంతకుడు.. ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్!
రాజీవ్ హంతకుల్లో ఒకరైన పెరారివలన్ ఈ మధ్యకాలంలో ఏంచేశాడో తెలుసా.. ! డీటీపీ కోర్సు నేర్చుకుని అందులో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు. కోర్టు అతనికి మరణశిక్ష విధించినా, ఆ చావు భయాన్ని దరిచేరనివ్వకుండా, చదువు మీదే దృష్టి పెట్టిన పెరారివలన్ జైళ్ల శాఖ నిర్వహిస్తోన్న విద్యా కార్యక్రమంలో ప్రథముడిగా నిలిచాడు.
వెల్లూరు జైలు.. తమిళనాడు ఓపెన్ యూనివర్శిటీ, మహాత్మాగాంధీ కమ్యూనిటీ కాలేజి సహకారంతో ఖైదీలకు విద్యా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 1991లో పెరంబుదూర్ వద్ద రాజీవ్ హత్య కేసులో కోర్టు మరణ శిక్ష విధించడంతో పెరారివలన్, మురుగన్, శాంతన్ లు క్షమాభిక్ష అభ్యర్థించారు. అయితే, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో ఈ త్రయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్ లో ఉంది.