: ప్రభాకరరెడ్డి మాతృమూర్తికి చంద్రబాబు నివాళి
రాజ్యసభ మాజీ సభ్యుడు పి.ప్రభాకరరెడ్డి మాతృమూర్తి సరస్వతమ్మ హైదరాబాదులో కన్నుమూశారు. ఆమె భౌతికకాయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సరస్వతమ్మ చివరి క్షణం వరకు సమాజం కోసమే ఆలోచించారని చెప్పారు. ఆమె సామాజిక స్పృహ కలిగిన వ్యక్తని... ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారని అన్నారు.