: అభిమాని సంతాప సభకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ


కర్ణాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, దివంగత కోటె వెంకటేష్ యాదవ్ సంతాప సభ ఇవాళ సాయంత్రం బెంగళూరులోని టౌన్ హాలులో జరుగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్, చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. గతేడాది అక్టోబరు 29న తన సోదరితో కలిసి హైదరాబాద్ వస్తున్న వెంకటేష్ పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇటీవల వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగబాబు ఐదు లక్షల రూపాయలను అందించారు.

  • Loading...

More Telugu News