: ధోనీ ఖాతాలో మరో 'బ్రాండ్'
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో చలాకీగా పరుగులు తీయడమేకాదు, వాణిజ్య ఒప్పందాలను ఒడిసిపట్టడంలోనూ ఘనాపాఠీయే. ఇప్పటికే పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఈ వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ తాజాగా ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.
ఎంక్యూర్ ఫార్మా సంస్థ ట్యాబ్లెట్లు, క్యాప్సూళ్ళు, ఇంజక్షన్లు తయారీ చేస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులకు ధోనీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. అయితే, ఈ ఒప్పందంతో ధోనీకి గిట్టుబాటు అయ్యేదెంతో తెలియరాలేదు.