: నూనె మీద పోసిందని ...చితక్కొట్టి చంపేశాడు


కొబ్బరినూనె మీద పోసిందన్న కోపంతో తండ్రి తన కుమార్తెను చితక్కొట్టి చంపేశాడు. బెంగళూరులోని హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉస్నాసుల్తానా కొన్నాళ్ల క్రితం మొదటి భర్తతో విడాకులు తీసుకుని అస్లాం అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటికే సుల్తానాకు ముగ్గురు పిల్లలు ఉండగా, అస్లాంకు కూడా మొదటి భార్య వల్ల నలుగురు పిల్లలున్నారు.

పిల్లలందరూ కూడా ధణిసంద్రలోని నందగోకుల లేఅవుట్ లో సుల్తానా, అస్లాం దగ్గరే ఉంటున్నారు. సుల్తానా గార్మెంట్స్ కంపెనీలో పని చేస్తుండగా, అస్లాం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సుల్తానా బిడ్డ నూరాయిన్ తాజ్ అలియాస్ తాజ్(10) తలకు నూనె రాసుకుంటుండగా అస్లాంపై పొరబాటుగా నూనె పడింది.

దీంతో ఆగ్రహించిన అస్లాం బాలికను విచక్షణారహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఛాతీ, కడుపు భాగంలో తన్నాడు. దెబ్బలను తట్టుకోలేని తాజ్ తల్లి ఇంటికి రాగానే కడుపునొప్పి అని చెప్పింది. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తుండగా బాలిక మృతి చెందింది. దీంతో అస్లాంను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News