: కోమాలోనే 45వ పుట్టినరోజు
ఫార్ములా 1 చాంపియన్ మైకేల్ షూమాకర్ కోమాలో ఉండగా.. ఆయన 45వ పుట్టిన రోజును ఈ రోజు అభిమానులు ప్రార్థనలతో జరుపుకోనున్నారు. షూమాకర్ పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని ఆయన మేనేజర్ తెలిపారు. ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలపై స్కీయింగ్ చేస్తూ పట్టుతప్పడంతో గాయపడి షూమాకర్ కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని గ్రెనోబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. షూమాకర్ పుట్టిన రోజు సందర్భంగా చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు ఫెర్రారి ఎఫ్ 1 టీమ్ వెళ్లనుంది.