: మమత సమక్షంలోనే జర్నలిస్టులపై దాడి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సమక్షంలోనే పోలీసులు జర్నలిస్టులను చితకబాదారు. నిన్న కోల్ కతా లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్, మమత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కేలండర్ ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి అక్కడున్న స్థలం సరిపోలేదు. దాంతో గీత దాటుకుని కెమెరామెన్లు ముందుకు వెళ్లారు. పోలీసులు వెనక్కి నెట్టేశారు. జర్నలిస్టులు నిరసన నినాదాలు అందుకున్నారు. అంతే... పోలీసులు చితక్కొట్టారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు గవర్నర్ను డిమాండ్ చేశారు. దీంతో గవర్నర్ అక్కడికక్కడే చర్యలకు ఆదేశించారు.