: మరో రైలు ప్రమాదం.. తప్పింది
అదృష్టవశాత్తూ మరో రైలు ప్రమాదం తప్పింది. పాలకొల్లు, నర్సాపూర్ మార్గంలో గోరింటాడ వద్ద రైలు పట్టా విరగడం... అదే సమయంలో హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ అటుగా రావడం జరిగాయి. పట్టా విరిగిన ప్రాంతానికి చేరుకునేలోపే సిబ్బంది గుర్తించడంతో రైలును దూరంగా ఆపేసి మరమ్మతు పనులు చేపట్టారు.