: క్యాన్సర్‌ను ఇలా అడ్డుకోవచ్చట!


క్యాన్సర్‌ వ్యాధిని నివారించడానికి వైద్యులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇలాంటి వాటిలో రొమ్ము క్యాన్సర్‌ను సమర్ధవంతంగా నివారించే ఒక సరికొత్త థెరపీని పరిశోధకులు వృద్ధి చేశారు. ఇప్పటి వరకూ క్యానర్‌ వ్యాధిని దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, కీమో, రేడియేషన్‌ థెరపీల ద్వారా అదుపులో ఉంచడం జరుగుతోంది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే. అదే...వ్యాధికి గురైన కణాలను చంపేయడం! ఈ చికిత్సల వల్ల ఆరోగ్యంగా ఉన్న కణాలు సైతం చనిపోయి రోగులు ఇతర దుష్ప్రభావాలకు గురవుతున్నారు. దీనిపై పరిశోధనలను సాగించిన శాస్త్రవేత్తలు వ్యాధి వ్యాపించిన కణాలను చంపడంకన్నా వాటిని ఆరోగ్యంగా మార్చడమే సరైన పద్ధతి అని భావించారు.

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యాన్సర్‌ కణాలను తిరిగి ఆరోగ్యవంతమైన కణాలుగా మార్చేందుకు కొత్తరకం థెరపీని అభివృద్ధి చేశారు. ఈ దిశగా వారు ఎలుకలపై చేసిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు. కాన్సర్‌కు అత్యంత సులభంగా గురయ్యే హోక్స్‌-ఏ1 జన్యువులను లక్ష్యంగా చేసుకుని 'స్మాల్‌ ఇంటెర్ఫెరింగ్‌ ఆర్‌ఎన్‌ఏ' విధానంలో పరిశోధకులు చికిత్స చేశారు.

దీనికి ఆయా కణాల్లో వ్యాధి తగ్గడమే కాకుండా రోజురోజుకూ కణాలు మరింత ఆరోగ్యవంతగా మారినట్టు పరిశోధకులు గుర్తించారు. తాము గుర్తించిన విషయం క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉన్న వారికి ఒక మంచి శుభవార్త వంటిదని, తమ పరిశోధనల ఫలితాలు మరిన్ని జీవితాల్లో వెలుగులను నింపే రోజు త్వరలోనే వస్తుందని ఈ పరిశోధన సాగిస్తున్న వ్యాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాన్‌ ఇంగ్బెర్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News