: 'ఈ' విటమిన్‌తో మతిమరుపు మాయం
మతిమరుపు సమస్య వేధిస్తుందా... అయితే మీరు విటమిన్ 'ఈ' ని కాస్త ఎక్కువగా తీసుకుంటే మతిమరుపును తరిమికొట్టవచ్చు. ముఖ్యంగా అల్జీమర్స్ బాధితులకు విటమిన్ 'ఈ' ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. అల్జీమర్స్ బాధితులు తమ రోజువారీ పనులను సరిగా చేసుకోలేరు. తమకు అవసరమైన వస్తువులను కొనడం, వంట వండుకోవడం, ప్రయాణాలు చేయడం వంటి రోజువారీ పనులను చేసుకోవడంలో వారికి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలను దూరం చేయడానికి విటమిన్ 'ఈ' చక్కగా ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
కాస్త తక్కువగా అల్జీమర్స్ ఉన్నవారు విటమిన్ 'ఈ' ఉండే మందులను తీసుకుంటే రోజువారీ పనులను కూడా చేసుకోలేని సమస్యలను కొంతమేర తగ్గించుకోవచ్చని, ఈ సమస్య ఏడాదికి 19 శాతం మేరకు విటమిన్ 'ఈ' ద్వారా తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. విటమిన్ 'ఈ' మందుల దుకాణాల్లో తేలికగా లభ్యమవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధనలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.