: మంచులో చిక్కుకున్న నౌక నుంచి 56 మందిని రక్షించిన అధికారులు


ఆ రష్యన్ నౌక అంటార్కిటికా మంచులో కూరుకుపోయింది. అకడమిక్ షోకల్ స్కీ నౌక పయనిస్తుండగా అంటార్కిటికా సముద్రంలో మంచు ఘనీభవించడంలో ఈ ఘటన సంభవించింది. దాంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 56 మంది ప్రయాణికులను రక్షించినట్లు రష్యన్ అధికారులు వెల్లడించారు. వీరిని హెలికాప్టర్ ద్వారా తరలించి ఆస్ట్రేలియాలో ఉన్న మరో నౌక లోనికి చేర్చారు. తమను సకాలంలో కాపాడిన సహాయక బృందాలకు వారు ధన్యవాదాలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఆందోళనలను దూరం చేసి.. ఆనందాన్ని నింపారని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News