: ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం
నలుగురు ఐఏఎస్ అధికారులు సహా ఆరుగురు ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బి.థామస్, ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ గా సురేంద్రమోహన్, గుంటూరు జాయింట్ కలెక్టర్ గా మురళీధర్ రెడ్డి, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా యాకూబ్ నాయక్ నియమితులయ్యారు. ఐఆర్ టీఎస్ అధికారి పాపిరెడ్డిని ఉద్యానవనశాఖ కమిషనర్ గా, రైతు బజార్ల సీఈఓగా మురుగేశ్ కుమార్ సింగ్ ను ప్రభుత్వం నియమించింది.