: ఆదర్శ్ సొసైటీ స్కాంపై నివేదికకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
సంచలనం సృష్టించిన ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై రూపొందిన నివేదికకు మహారాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలతో ఈ రోజు సమావేశమైన మహా కేబినెట్ నివేదికను పునః పరిశీలించి ఆమోదిస్తున్నట్లు చెప్పింది. దాంతో, నివేదిక ఆధారంగా ఆదర్శ్ సొసైటీ స్కాంకు సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పృధ్విరాజ్ చవాన్ తెలిపారు. సొసైటీలోని 22 ప్లాట్లు బినామీల పేర్లతో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.