: ‘మీ సేవ‘ సిబ్బందికి జీతమూ లేదు.. పీఎఫ్ జమ కాలేదు


రాష్ట్రంలో ‘మీ సేవ’లో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా ఏర్పాటు చేసిన మీసేవ సర్వీసు బాగానే ఉన్నా.. నిర్వహణలో అభాసుపాలవుతోంది. తాజాగా ‘మీ సేవ’ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న ముంబై సంస్థ జీతాలు చెల్లించని వైనం వెలుగులోకి వచ్చింది. ‘మీ సేవ’లో కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన 500 మందికి పైగానే సిబ్బంది పనిచేస్తున్నారు. వారి వేతన బకాయిలు సుమారు 50 లక్షల రూపాయల వరకు పేరుకుపోయినా సంబంధిత ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ముంబై సంస్థకు నోటీసులు కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ముంబైలో ఆ సంస్థ చిరునామా మార్చేసినా.. ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే.. ‘మీ సేవ’ కాంట్రాక్ట్ గడువు సమీపిస్తున్న తరుణంలో కొత్త వారికి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి, పెండింగ్ లో ఉన్న జీతాలను, పీఎఫ్ ను జమ అయ్యేలా చూడాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా, ఆ విషయం తమ పరిధిలోకి రాదంటూ ప్రభుత్వ అధికారులు తప్పించుకొనే ప్రయత్నం చే్స్తున్నారు. ఇకనైనా తమకు న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News