: పండుగ స్పెషల్... హైదరాబాదు నుంచి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్యాకేజీ టూర్లు
ఈ నెల 5వ తేదీ, ఆదివారం నుంచి ఆర్టీసీ ప్యాకేజీ టూర్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు హైదరాబాదు నగరం నుంచి రాష్ట్రంలోని పలు పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాదు నుంచి వర్గల్, కీసరగుట్ట, యాదగిరిగుట్ట, చిలుకూరు, అనంతగిరి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్యాకేజీ టూర్ సమగ్ర వివరాల కోసం 73828 03308, 73828 38238 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.