: తలకిందులుగా తపస్సు చేసినా విభజన జరగదు: లగడపాటి


ఎన్ని ధూంధాంలు చేసినా, బంద్ లు చేసినా, ఇబ్బందులు సృష్టించినా విభజన జరగదని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్ర విభజన జరగదని అన్నారు. లేనిపోని సంబరాలు, ఆందోళనలు, ఆలోచనలు చేయడం దండగ అని ఆయన తేల్చిపారేశారు. ఇప్పటికైనా సమైక్యం విలువ తెలుసుకుని మెలగాలని ఆయన నేతలకు సూచించారు. ప్రజల మధ్య విభజన విద్వేషాలు రగల్చకుండా ఉండాలని లగడపాటి హితవు పలికారు.

  • Loading...

More Telugu News