: మొదటి రోజు ఆట వర్షార్పణం


భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు తొలి రోజు ఆట ఒక్కబంతి కూడా పడకుండానే రద్దయింది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం, గురవారం ఉదయం కూడా ముంచెత్తడంతో మ్యాచ్ వేదిక మొహాలీలోని పీసీఏ స్టేడియం తడిసి ముద్దయింది.

మైదానం పూర్తిగా నీటితో నిండిపోవడంతో టాస్ కూడా వేయలేదు. ఇక ఈ రోజుకు ఆట నిర్వహించేందుకు పరిస్థితులు అనువుగా లేకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తొలి రోజు ఆట వర్షార్పణం కావడంతో మిగతా నాలుగు రోజుల పాటు ఆటను అరగంట ముందుగా ఆరంభిస్తారు. 

  • Loading...

More Telugu News