: అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పళ్లంరాజు


తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నగరంలో దుమ్ములపేటలో జరిగిన అగ్నిప్రమాదంలో 180 పూరిళ్లు దగ్ధమయ్యాయని అధికారికంగా ప్రకటించారు. నిరాశ్రయులకు కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఏఎంజీ ఇంటర్నేషనల్ స్కూల్ భవనంలో ఆశ్రయం కల్పించి ఏర్పాట్లను పరిశీలించారు. బాధితులకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అందించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అగ్ని ప్రమాద బాధితులను కేంద్ర మంత్రి పళ్లంరాజు పరామర్శించారు. అయితే.. కళ్ల ఎదుటే నివాసాలు ఆహుతి కావడంతో తాము కట్టుబట్టలతో మిగిలామని, తమను ఆదుకోవాలని బాధితులు మంత్రికి విన్నవించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News