: రెండో ర్యాంకుకు ఎగబాకిన సైనా
తాజాగా ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్రపంచ ర్యాంకుల్లో స్టార్ షట్లర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రెండో ర్యాంకుకు ఎగబాకింది. గతవారం ప్రకటించిన ర్యాంకుల్లో మూడో స్థానానికి పడిపోయిన సైనాకు.. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ లో సెమీ ఫైనల్స్ కు చేరడం ఎంతగానో లాభించిందని చెప్పవచ్చు. ఇక తెలుగు ఆటగాడు పారుపల్లి కశ్యప్.. రెండు స్థానాలు మెరుగు పర్చుకుని 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. మరో తెలుగమ్మాయి పివి సింధు 16వ స్థానంతో సరిపెట్టుకుంది.