: కొత్త ఏడాదిలో ఆమ్ ఆద్మీకి విరాళాల వెల్లువ
పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అన్నీ శుభ శకునాలే. పెట్టిన ఏడాదికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అంతకుముందు ఈ పార్టీకి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కొన్ని కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. తాజాగా, కొత్త సంవత్సరంలోనూ విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. జనవరి 1న 2,476 మంది నుంచి రూ.41 లక్షలు పార్టీకి విరాళంగా వచ్చాయి.