: కుంతియాను కలిసిన శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాను కలిశారు. శాఖ మార్పుపై కుంతియాతో మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. ఈ సందర్భంగా తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్టు కూడా ఆయనకు వివరించినట్టు సమాచారం. అనంతరం కుంతియాతో కలిసి మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, సారయ్య, ఎంపీ వీహెచ్ తదితరులు మహబూబ్ నగర్ జిల్లా అమన్ గల్ బయల్దేరి వెళ్లారు.