: రాష్ట్రపతి సంతకంతో లోక్ పాల్ కు చట్టబద్ధత
ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న లోక్ పాల్ బిల్లుకు ఎట్టకేలకు చట్టబద్దత లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న(బుధవారం)ఈ బిల్లుపై సంతకం చేసి ఆమోదం తెలిపారు. అనంతరం బిల్లు చట్టరూపం దాల్చి.. లోక్ పాల్ వ్యవస్థకు రంగం సిద్ధమవుతుంది. బిల్లు పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొన్ని రక్షణలతో ప్రధానమంత్రి కూడా వస్తారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో డిసెంబర్ 17న రాజ్యసభలో ఆమోదం ఆమోదం పొందిన బిల్లు... తర్వాత రోజే లోక్ సభలోనూ ఆమోదం పొందింది.