: ముఖ్యమంత్రితో కాసేపట్లో భేటీ కానున్న ఉద్యోగ సంఘాల నేతలు
మరి కొద్ది సేపట్లో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి కిరణ్ తో భేటీ కానున్నారు. నిన్న మధ్యంతర భృతిపై రెండు దఫాలుగా ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగులు చర్చించినా ఎంత శాతం ఇవ్వాలనే అంశంలో స్పష్టత రాలేదు. దీంతో, మధ్యంతర భృతి వ్యవహారంలో సీఎం దగ్గరే అమీ తుమీ తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో ఉద్యోగనేతలు చర్చలు జరపనున్నారు.