: మన కంప్యూటర్ ‘సూపర్’
మనం రూపొందించిన కంప్యూటర్ మంచి కంప్యూటర్‌గా పేరుపొందింది. భారత శాస్త్రవేత్తలు రూపొందించిన పరమ్ యువ`2 సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే విద్యుత్తును అత్యంత సమర్ధవంతంగా వినియోగించుకునే కంప్యూటర్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది.
అమెరికాలోని డెన్వర్‌లో జరిగిన సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్‌లో ‘గ్రీన్ 500’ జాబితాను విడుదల చేశారు. విద్యుత్తును తక్కువగా వినియోగించుకునే కంప్యూటర్లకు గ్రీన్`500 ర్యాంకులను ప్రకటిస్తారు. ఈ జాబితాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ`డాక్) తయారుచేసిన పరమ్ యువ`2 సూపర్ కంప్యూటర్ మనదేశంలో మొదటిస్థానంలోను, ఆసియాలో అది 9వ స్థానంలోను, అలాగే ప్రపంచంలో 44వ స్థానంలోను నిలిచింది.