: అంత్యక్రియల విషయంలో పోలీసులకేంటి అంత తొందర?: ఫైరవుతున్న ప్రజలు


అత్యాచార బాధితురాలైన బాలిక అంత్యక్రియలపై కోల్ కతాలో పోలీసులు, ప్రజల మధ్య వివాదం రాజుకుంది. దీంతో వామపక్షాలు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అక్టోబర్ లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. దీనిని జీర్ణించుకోలేని బాలిక డిసెంబర్ 23న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ నిన్న మరణించింది. ఆటో డ్రైవరైన ఆ బాలిక తండ్రి వామపక్ష విభాగమైన సీఐటీయు మెంబర్ కూడా.

దీంతో సీఐటీయూ యూనియన్ ర్యాలీకి పిలుపునిచ్చింది. దాంతో అంత్యక్రియలు ర్యాలీ తరువాత నిర్వహించాలని బాలిక కుటుంబం నిర్ణయించి, శవాన్ని మార్చురీలో భద్రపరచింది. ఇంతలో బాలిక కుటుంబసభ్యులకు తెలియకుండా మృతదేహాన్ని రాత్రికిరాత్రే అంత్యక్రియల నిమిత్తం శ్మశానానికి పోలీసులు తరలించారు.

మరణధృవీకరణ పత్రం తమవద్ద లేకపోవడంతో అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేకపోయారు. దీంతో పోలీసులకు అంత తొందర దేనికని? పోలీసుల పాత్ర ఏంటని స్థానికులు, యూనియన్ నేతలు ప్రశ్నిస్తూ అందోళనకు దిగారు. ఈ సాయంత్రం శవానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News