: ఎల్లుండి నుంచి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల 'సంకల్ప దీక్ష'
సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాదులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు దీక్ష చేపట్టనున్నారు. సంకల్ప దీక్ష పేరుతో చేపట్టనున్న ఈ దీక్ష ఈ నెల 3వ తేదీన (ఎల్లుండి) ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇందిరాపార్క్ వద్ద ఈ దీక్షను చేపట్టనున్నారు. ఈ దీక్ష అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో జరగనుంది. గత నెల 26వ తేదీన సంకల్ప దీక్ష కోసం సీమాంధ్ర ఎంపీలు పోలీసుల అనుమతిని కోరారు.