: పాలెం బస్సు దుర్ఘటనపై 40 రోజుల్లో ఛార్జిషీట్: సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్


మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని పాలెం సమీపంలో వోల్వో బస్సు ప్రమాదం జరిగిన సంగతి విదితమే. ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ చెప్పారు. బస్సు ప్రమాదంలో 15 నిమిషాల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టమని, ఒకరిద్దరి అరెస్టులతోనే సరిపెట్టుకోమని ఆయన స్పష్టం చేశారు. చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని కృష్ణప్రసాద్ తెలిపారు. వోల్వో బస్సు నిర్మాణపరమైన లోపాలు, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు, అధికారుల నిర్లక్ష్యం.. వీటన్నింటిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనపై 40 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News