: మూడో టెస్టుకు వాన పోటు
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. మ్యాచ్ కు వేదికైన మొహాలీలోని పీసీఏ స్టేడియాన్నిగురువారం ఉదయం వర్షం ముంచెత్తడంతో తొలి రోజు ఆట ఇంకా మొదలుకాలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ కూడా వేయలేదు. దీంతో, భారత్ జట్టు హోటల్ కు తిరిగివెళ్లగా, ఆసీస్ జట్టు డ్రెస్సింగ్ రూంకే పరిమితమైంది. ప్రస్తుతం సిబ్బంది మైదానాన్ని ఆటకు సిద్ధం చేసేందుకు శ్రమిస్తున్నారు.