: చేతిలో చిల్లిగవ్వ లేకున్నా శామ్ సంగ్ గెలాక్సీ సొంతం
శామ్ సంగ్ గెలాక్సీలపై మోజు ఉండనిది ఎవరికి? కొనుక్కోవాలనే అభిలాష. జేబు చూసుకున్నా.. బ్యాంకు బ్యాలెన్స్ చూసుకున్నా నిరాశ. అయినా పర్లేదు. ఒక్క క్రెడిట్ కార్డు దగ్గరుంటే చాలు. క్రెడిట్ కార్డు ఉంటే ఒకరిచ్చేదేంది? అనుకోకండి. ఎందుకంటే రూపాయి వడ్డీ ఉండదు. నెలకింత చొప్పున 18 నెలల్లో తీర్చేస్తే చాలు. గెలాక్సీ నోట్ 2, నోట్ 3, టాబ్ 3, టాబ్ 10.1, ఎస్ 4, ఎస్ 4 మినీ, ఎస్ 3లను సొంతం చేసుకోవచ్చు. శామ్ సంగ్ భారతీయ వినియోగదారుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ, సిటీబ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డులున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.