: ఎస్ అనకుంటే ఐఏఎస్ అధికారులకు స్థానచలనమే!


ఎస్ అనకుంటే ఐఏఎస్ అధికారులకు స్థానచలనమే! అలా తయారైపోయింది పాలకుల తీరు. రాజకీయ ఒత్తిళ్లు, నేతల స్వార్థ ప్రయోజనాల వల్ల నిజాయతీ అధికారులు గట్టిగా ఒక పోస్టులో ఏడాదిన్నర కూడా పనిచేయకుండానే కొత్త పోస్టుకు వెళ్లిపోవాల్సి వస్తోంది. ప్రతీ ముగ్గురు ఐఏఎస్ అధికారుల్లో ఇద్దరు సగటున 18 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలమే ఒక పోస్టులో పనిచేయగలుగుతున్నారు. ఈ విషయాన్ని వారి సర్వీసుల రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వినీత్ చౌదరి దేశంలోనే అత్యధికంగా 31 ఏళ్ల పదవీ కాలంలో 52 సార్లు బదిలీకి గురయ్యారు. దేశంలో ఐఏఎస్ అధికారులను చీటికి మాటికి బదిలీ చేస్తున్న రాష్ట్రాలలో హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, యూపీ, అసోం-మేఘాలయ ముందున్నాయి.

  • Loading...

More Telugu News