: రెండవసారి వాయిదా పడిన శాసనసభ


శాసనసభ రెండవసారి వాయిదా పడింది. టీడీపీ, టీఆర్ఎస్ శాసనసభ్యుల నినాదాలతో సభలో గందరగోళం రేగింది. విద్యుత్ కోతలపై చర్చించాలని టీడీపీ డిమాండు చేయగా, తెలంగాణ నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ నేతలు స్పీకర్ పోడియం లోకి దూసుకెళ్లి చుట్టుముట్టారు.

ఈ సందర్భంగా దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల బాధితులకు కొద్దిసేపు సంతాపం ప్రకటించాలని స్పీకర్ మనోహర్ కోరారు. దీంతో 2 నిమిషాల పాటు సంతాపం ప్రకటించారు. తర్వాత సభలో సభ్యులు అదే తీరును కొనసాగించడంతో స్పీకర్ సభను  మరల అర్ధగంట పాటు  వాయిదా వేశారు 

  • Loading...

More Telugu News