: కొత్త ఏడాదిలోనూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది: శైలజానాథ్
2014లోనూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని మంత్రి శైలజానాథ్ అన్నారు. తనకు కొత్తగా అప్పజెప్పిన బాధ్యతల (శాసనసభ వ్యవహారాల శాఖ) గురించి ఇప్పుడే ఆలోచించనని అనంతపురంలో తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి బదిలీ చేసి ఆ బాధ్యతలను శైలజానాథ్ కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పజెప్పిన సంగతి తెలిసిందే.