: అండర్సన్ ప్రపంచ రికార్డు.. 36 బంతుల్లో సెంచరీ


రికార్డులున్నవి బద్దలవడానికే అంటే ఇదేనేమో! క్వీన్స్ టన్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డేలో కివీస్ బ్యాట్స్ మెన్ కొరె అండర్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 36 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అండర్సన్ 12 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. దీంతో 1996 లో పాక్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు (37 బంతులు) కనుమరుగైంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో అండర్సన్ 47 బంతుల్లో 131 పరుగులు (14 సిక్సర్లు, 6 ఫోర్లు) చేశాడు.

  • Loading...

More Telugu News