: 00.01గంటలు.. గోవిందా గోవింద
అర్ధరాత్రి 12 గంటలు దాటింది. 2014 తొలి నిమిషం ప్రారంభం కావడమే ఆలస్యం.. తిరుమల వీధులన్నీ గోవిందనామ స్మరణలతో మార్మోగాయి. తిరుమలలో గోవింద నామస్మరణ నిత్యం వినిపించేదే. కానీ, నూతన ఆంగ్ల సంవత్సరాగమనం సందర్భంగా సంతోషంతో భక్తులు చేసిన నామస్మరణలు అవి. 'శుభం కలిగించు స్వామీ' అంటూ దేవదేవునికి వారు చేసిన విన్నపాలు అవి. విన్నపాలు వినవలే వింత వింతలూ... అని అన్నమయ్య లాలించి మరీ ఏడుకొండల వాడికి తన అభ్యర్థనలు విన్నవించినట్లే.. భక్తులు కూడా నూతన సంవత్సరం రాగానే మమ్మల్ని కటాక్షించు స్వామీ అంటూ గోవిందుడి నామాన్ని స్మరించారు. భక్తులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.