: జన్యువులపై మందు ముద్ర పడుతుందట


మందుబాబులకు ఒక హెచ్చరిక! మందు తాగేవారికి వారి జన్యువులపై ఆల్కహాల్‌ తనదైన ముద్ర వేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వారాంతంలో మందు తాగే యువత జన్యువులపై ఆల్కహాల్‌ ముద్ర పడుతుందని తేలింది. దీనివల్ల కణాలు దెబ్బతింటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మెక్సికోకు చెందిన ఆడెలా రెండన్‌ వారాంతాల్లో మందు తాగేవారిపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో కణత్వచాలు, జన్యుపదార్ధాన్ని కలిగివుండే కొవ్వు పదార్థాలపై మద్యం ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ అధ్యయనంలో వారాంతాల్లో నిత్యం మందు తాగే యువత జన్యువులపై ఆల్కహాల్‌ ముద్ర పడుతుందని తేలింది. ఇందుకోసం వారాంతాల్లో మద్యం తాగే అలవాటున్న, ఎలాంటి అలవాటు లేని 18 నుండి 23 ఏళ్ల విద్యార్ధులను రెండు గ్రూపులుగా విభజించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో ఆల్కహాల్‌ ఎంజైములు ఇథనాల్‌ను, ఎసిటాల్డిహైడ్‌, ఎసిటోఎసిటెట్‌, ఎసిటోన్లుగా మార్చే జీవక్రియలను వీరిలో లెక్కించారు.

తర్వాత డిఎన్‌ఏపై ఆల్కహాల్‌ ప్రభావాన్ని పరీక్షించేందుకు తెల్లరక్తకణాల్లోని కేంద్రకాన్ని విద్యుత్‌ సంచలనానికి గురిచేశారు. ఈ సమయంలో ఆల్కహాల్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న వారిలో డిఎన్‌ఏపై విద్యుత్‌ సంచలన సమయంలో వలయం ఏర్పడుతున్నట్టు గుర్తించారు. మద్యం అలవాటు లేనివారికంటే మందు తాగే అలవాటున్న వారిలో 5.3 రెట్లు ఎక్కువగా కణాలు దెబ్బతింటున్నట్టు వీరు తమ పరిశోధనలో కనుగొన్నారు.

  • Loading...

More Telugu News