: రాష్ట్ర మంత్రివర్గంలో శాఖల మార్పులపై ఆందోళనకు గురికావద్దు: కేసీఆర్
రాష్ట్ర మంత్రివర్గంలో శాఖల మార్పులపై తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రానికి గాని, రాష్ట్ర శాసనసభకు గాని ఎటువంటి అధికారాలు లేవన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంట్ కు మాత్రమే సర్వాధికారాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్న ఈ తరుణంలో అపోహలు రావడంలో వింతేమీ కాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.