: విభజన సమస్యకు పరిష్కారం చూపాలి: జేపీ
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి భవిష్యత్తు చూపే నాయకత్వం కావాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాదులో లోక్ సత్తా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం, పదవుల కోసం పనిచేసే పార్టీలకు స్వస్తి పలకాలని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్సే నాంది పలికారని ఆయన చెప్పారు. కుమారులు, కుమార్తెలకు అధికారం కట్టబెట్టాలనే ధోరణి కొందరి నాయకుల్లో కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.