: అవేవీ నిజం కాదు... అన్నీ వూహాగానాలే: మనీష్ తివారీ


ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాజీనామా చేస్తారని, రాహుల్ గాంధీకి ప్రధాని పదవి అవకాశం కల్పిస్తూ మన్మోహన్ సింగ్ తప్పుకుంటారని గత రాత్రి కొన్ని హిందీ ఛానెల్స్ వార్తలను ప్రసారం చేశాయి. దీంతో ప్రధాని తప్పుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం మనీష్ తివారీతో ఓ ప్రకటన చేయించింది.

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధాని ఏర్పాట్లు చేస్తుంటే ఈ తప్పుడు ప్రచారం ఏంటని కేంద్ర మంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. ప్రధాని మీడియాతో ఎక్కువగా మాట్లాడని కారణంగా మీడియా ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అవన్నీ నిరాధార ఊహాగాన వార్తలని కేంద్రమంత్రి మనీష్ తివారీ వాటిని కొట్టిపడేశారు.

  • Loading...

More Telugu News