: పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పర్లేదు: కొండ్రు మురళి
కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎవరు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని మంత్రి కొండ్రు మురళి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ శాసనసభలో సమైక్య తీర్మానం కోసం పట్టుపడతామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు రెండు వందల మంది నుంచి మూడు వందల మంది వరకు ఉన్నారని, వారే పార్టీని కాపాడుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని వీడతారన్నది ఊహాగానమని, ఆయన పార్టీలోనే కొనసాగుతారని మంత్రి కొండ్రు స్పష్టం చేశారు.