: విశాఖ జిల్లాలో 540 కిలోల గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా రోలుగుంట మండలం లోని వడ్డిప వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 540 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. క్వాలిస్ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు పట్టుకోగా.. మరో ఏడుగురు పరారయ్యారు.