: సినీతార పార్వతీ మెల్టన్ పై ఎమ్మిగనూరులో పోలీసు కేసు


గతంలో పలు చిత్రాలలో నటించిన కథానాయిక పార్వతీ మెల్టన్ పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీసు కేసు నమోదైంది. ఇటీవల ఆమె నటించిన 'యమహో యమః' చిత్రంలో ఆమె అశ్లీలంగా నటించారనీ, అందుకు సంబంధించిన పోస్టర్లను పట్టణంలో అంటించారనీ ఫిర్యాదు అందడంతో ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆమెపై ఐపీసీ 292, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలో పార్వతీ మెల్టన్ కు ఈ కేసు విషయంలో తాఖీదులు పంపనున్నట్టు ఎస్ఐ తెలిపారు. అన్నట్టు, పార్వతి ఇటీవలే ముంబయ్ లో ఓ పారిశ్రామిక వేత్తను వివాహమాడింది.        

  • Loading...

More Telugu News