: శీతాకాల విడిది ముగించుకొని.. ఢిల్లీ వెళ్లిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది ముగిసింది. దాంతో ఈరోజు ఉదయం హైదరాబాదు నుంచి బయల్దేరిన ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. శీతాకాల విడిది ముగింపు సందర్భంగా నిన్న (సోమవారం) బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. రాష్ట్రపతి పర్యటన కాలంలో ఆయనతో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమై తమ సాధకబాధకాలను విన్నవించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర నేతలు కోరగా, రాష్ట్ర విభజన వేగంగా జరిగేలా చూడాలని తెలంగాణ ప్రాంత నేతలు కోరారు.