: మాంసాహారులూ తస్మాత్‌ జాగ్రత్త!


కొందరు తమకు రోజూ కక్క ముక్క లేకుంటే ముద్ద దిగదంటుంటారు. ఇలాంటి వారికి మాత్రం నిజంగా ఇది ఒక హెచ్చరికే. ఎందుకంటే, మాంసాహారాన్ని విపరీతంగా తినేవారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిజానికి చెడు అలవాట్లుగా చెప్పే ధూమపానం, మద్యపానాలకు క్యాన్సర్‌కు అవినాభావ సంబంధం ఉందని, వీటితోబాటు మాంసాహారం తీసుకునేవారికి, క్యాన్సర్‌ సోకే ప్రమాదముందని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

జార్జివాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థనుండి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేక అధ్యయనాన్ని జరిపారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు పలు దేశాలనుండి క్యాన్సర్‌ సమాచారాన్ని పోల్చి విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ధూమపానం, మాంసాహారం, మద్యపానాలకు క్యాన్సర్‌కు గట్టి సంబంధం ఉన్నట్టు తేలింది. తమ అధ్యయనంలో ముఖ్యంగా జంతు సంబంధమైన ఆహార పదార్ధాలు క్యాన్సర్‌ వ్యాధిని పెంపొందించడంలో కీలకంగా మారుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణం జంతు సంబంధ ఆహార ఉత్పత్తులు శరీర వృద్ధితోబాటు శరీరంలోని కణుతుల వృద్ధిని కూడా ప్రోత్సహిస్తున్నట్టు పరిశోధకులు తేల్చారు.

తమ పరిశోధనలో ఇన్సులిన్‌ తరహాలోని వృద్ధి కారకం ఐజీఎఫ్‌-ఐ ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ఆహార పదార్ధాలు కణుతుల వృద్ధిని కూడా ప్రోత్సహిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మాంసాహారానికి, క్యాన్సర్‌ ముప్పునకు మధ్యగల సంబంధం చాలా ముఖ్యమైనదని ఈ పరిశోధనలో పాల్గొన్న నియల్‌ బర్నార్డ్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News