: గూగుల్‌ గుబులు పుట్టిస్తోందట


గూగుల్‌ సంస్థ అనేక ప్రభుత్వాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కాబట్టే ఆ సంస్థపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతున్నాయట. మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే మనం చేసే పని గూగుల్‌ ముందు వాలిపోవడం. చాలామంది నెటిజన్లు చేసేపని ఇదే. తమకు తెలియని సమాచారాన్ని అందించే గూగుల్‌లో బోలెడన్ని విషయాలుంటాయి. వాటిలో పలు ప్రభుత్వాలకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. అయితే ప్రభుత్వాల గురించి కేవలం సానుకూలంగానే కాకుండా వ్యతిరేకంగా ఉండే సమాచారం కూడా గూగుల్‌లో మనకు లభ్యమవుతుంది. ఇందులో ప్రభుత్వాలకు సంబంధించి వ్యతిరేక సమాచారాన్ని తొలగించాల్సిందిగా గూగుల్‌పై రాజకీయపరమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయట.

సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజంగా పేర్కొనబడే గూగుల్‌లోని, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ పరమైన సమాచారాన్ని తొలగించాల్సిందిగా అనేక ప్రభుత్వాలు, పలు నిఘా సంస్థలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని గూగుల్‌ పేర్కొంది. అనేకమంది న్యాయమూర్తులు గూగుల్‌లోని రాజకీయ సంబంధ సమాచారాన్ని తొలగించాల్సిందిగా కోరారని, అలాగే అనేక స్థానిక సంస్థలు కూడా ఇదే విషయాన్ని గురించి తమకు విజ్ఞప్తి చేశాయని, ఇందుకు సంబంధించి వివిధ దేశాల ప్రభుత్వాల నుండి ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్యకాలంలో సుమారు 3,846 వినతులు వచ్చాయని గూగుల్‌ లీగల్‌ డైరెక్టర్‌ సుసాన్‌ ఇన్‌ఫాంటినో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News