: పరాజయం పాలైన టీమిండియా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. రెండు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు నిర్దేశించిన 58 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. స్మిత్ 27, పీటర్సన్ 31 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు విజయాన్నిందించారు. జొహెన్నెస్ బర్గ్ లో జరిగిన తొలి టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే.