: సోనియా పెద్ద అనకొండ.. జగన్ చిన్న అనకొండ: చంద్రబాబు
తిరుపతి గర్జనకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అవినీతి, అసమర్థతతో రాష్ట్రాన్ని పాడు చేసిందని ఆయన మండిపడ్డారు. పాముకు పాలు పోస్తే కాటు వేస్తుందని, అలాగే భర్తపోయాడని కనికరించి సోనియాకు ఓట్లేసి గెలిపిస్తే, రాజశేఖర్ రెడ్డి అనే పామును ఆమె రాష్ట్రంలో పెంచి పోషించిందని ఆయన విమర్శించారు.
సోనియా పెద్ద అనకొండ అయితే, జగన్ చిన్న అనకొండ అన్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డా, సీబీఐ 10 ఛార్జిషీట్లు వేస్తే శిక్షపడలేదని ఆయన దుయ్యబట్టారు. అవినీతి గురించి గొంతుచించుకుంటున్న రాహుల్ గాంధీ... రాబర్ట్ వాద్రా అవినీతిని గుర్తించాలని చంద్రబాబు సూచించారు. వీరి అవినీతి ఫలితంగా రూపాయి విలువ క్షీణించిందని చంద్రబాబు విమర్శించారు.