: ఇంటర్ విద్యార్థినిని గర్భవతిని చేసిన వాచ్ మెన్
అమాయకురాలైన విద్యార్థినిని ఓ వాచ్ మెన్ గర్భవతిని చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ లో ఉన్న ఓ ఇంటర్మీడియేట్ విద్యార్థిని గర్భం దాల్చింది. వివరాల్లోకి వెళ్తే, హాస్టల్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తి ఐదు నెలల క్రితం ఓ విద్యార్థినిని బలవంతంగా లోబరుచుకున్నాడు. అనంతరం అక్కడ ఉద్యోగం వదిలేశాడు. అయితే ఆ విద్యార్థిని కాలేజీకి వెళ్లి వచ్చే దారిలో కాపు కాస్తూ, ఆ అమ్మాయిని బెదిరిస్తూ రూంకు తీసుకెళ్లి అనుభవిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. దీంతో ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు మోహన్ పై మోసం, అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.