: దుప్పట్ల పంపిణీలో చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి


ఉత్తరప్రదేశ్ లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. అధికారులు, రాజకీయ నాయకులు అందుకు తలో చేయివేస్తుంటారు. తాజాగా ఓ మంత్రి పబ్లిక్ లో ఓ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించి వార్తల్లో నిలిచారు. రోహనియా గ్రామంలో ప్రభుత్వం తరపున దుప్పట్ల పంపిణీ చేపట్టిన ప్రజాపనుల శాఖా మంత్రి సురేందర్ సింగ్ పటేల్ పంపిణీ సందర్భంగా ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు.

ఈ సన్నివేశం మీడియా కంటబడింది. ఇక ఆగుతుందా విషయం... యూపీలో ఏ వార్తా ఛానెల్ చూసినా, 'దుప్పట్లందుకోడానికి వచ్చిన వ్యక్తి చెంపఛెళ్లుమనిపించిన మంత్రి' అంటూ వార్తా కథనాలు పదేపదే ప్రసారం చేశాయి. దీంతో సదరు మంత్రి తాను కొట్టింది వేరెవర్నో కాదని, తనమేనల్లుడినేనని, దుప్పట్లు తీసుకురమ్మని చెప్పానని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News