: ఏటిఎం వినియోగదారులపై బాదుడుకు బ్యాంకుల కసరత్తు


బ్యాంకు సేవల విస్తరణలో భాగంగా ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా ఏటీఎంలను పెట్టిన బ్యాంకులు ఇప్పుడు తోక ముడుస్తున్నాయి. బెంగళూరులో జరిగిన దాడి ఘటన, ఏటీఎంలపై జరుగుతున్న చోరీ దాడులతో అప్రమత్తమైన పోలీసులు సెక్యూరిటీలను నియమించాల్సిందేనని నిబంధన విధించే సరికి పట్టణ ప్రాంతాల్లోని శివార్లలో ఏర్పాటు చేసిన పలు ఏటీఎంలను మూసివేయనున్నాయి. మరో వైపు నగరాల్లో తెరచి ఉంచే ఏటీఎంలలో కూడా సెక్యూరిటీ సేవల భారాన్ని వినియోగదారుడిపైనే వేయనున్నాయి. వాడుకునే వాడికి వాడుకున్నంత అన్న చందంగా ఏటీఎంలో జరిపే ప్రతి లావాదేవీకి ఆరు రూపాయల చొప్పున బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈ ప్రతిపాదనలని బ్యాంకులు ఆర్బీఐకి పంపనున్నాయి. ఆర్బీఐ ఆమోదిస్తే ఈ విధానం అమలులోకి వస్తుంది.

  • Loading...

More Telugu News